Kadem | బెల్లాల్ లో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం

Kadem | బెల్లాల్ లో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం

Kadem | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని గోపాలమిత్ర సెంటర్ బెల్లాల్ గ్రామంలో ఇవాళ‌ పశు గర్భకోశ ఉచిత శిబిరం నిర్వహించారు. శిబిరానికి ముఖ్యఅతిథిగా బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మి డాక్టర్ భూమన్న యాదవ్ లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కడెం మండల పశు వైద్య అధికారి డాక్టర్ పి.సౌందర్య మాట్లాడుతూ… పశువులకు తగిన సమయంలో టీకాలు వేయించుకోవాలని రైతులను కోరారు.

అదేవిధంగా పశువులు ఎదకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న గోపాలమిత్ర కు సమాచారం అందించిన‌ట్లైతే మీ ఇంటికి వచ్చి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుందని, అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యాదవ్, గోపాలమిత్ర సూపర్ వైజర్ గోపాల్, జెవి ఓ రాజేశ్వర్, గోపాలమిత్రాలు జి మల్లేష్, మదన్, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply