కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail) లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు (Jailer Appa Rao), డిప్యూటీ సూపరింటెండెంట్ (Deputy Superintendent) కమలాకర్ తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ (Prisons Department DG) ఉత్తర్వులు జారీ చేశారు.
జైలులో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు మొబైల్ ఫోన్లు అందిస్తున్నారన్న అభియోగాలపై గత నాలుగు రోజులుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.