ముగిసిన కబడ్డీ పోటీలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని చింతపల్లిలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు శుక్రవారం ముగిసాయి.మొదటి బహుమతి బజరంగ్ మహేష్ టీం రూ. 20వేలు రెండవ బహుమతి లింగాల రాజన్న చింతపల్లి టీం రూ.10వేలు మూడవ బహుమతి మహావీర్ టీం రూ. 5వేలు బహుమతులు గెలుపొందిన టీములకు దండేపల్లి ఎస్ఐ తహిసినోద్దీన్ చేతుల మీదుగా ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ మెమొంటోలుఅందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, నాయకులు గొర్ల మధుకర్, గడ్డం మధుకర్, మల్యాల శ్రీనివాస్, చుంచు చందు, పేరం జనార్ధన్, ఆకుల రమేష్,అక్కల రాజన్న, గోపు రవి, గొర్ల శేఖర్, దయ్యాల వెంకటేష్, అక్కల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
