పిల్లలను శివాజీలా తీర్చిదిద్దాలి

పిల్లలను శివాజీలా తీర్చిదిద్దాలి
- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ ; ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చత్రపతి శివాజీ మహారాజ్ ల తీర్చిదిద్దాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. ఛత్రపతి శివాజీమహారాజ్ జయంతిని పురస్కరించుకొని జుక్కల్ మండలంలోని శివాజీచౌక్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ దివ్య విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి జీజాబాయి శివాజీ మహారాజ్ ను చిన్నతనం నుండే దేశభక్తి, సేవగుణం, విద్యాబోదన కల్పించడంతో నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా శివాజీమహారాజ్ ను కులమతాలకు అతీతంగా ప్రతి మానవుని హృదయంలో నిలిచిపోయారన్నారు.
ప్రతి యువకుడు శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని వారి జీవనవిధానాన్ని, ధైర్యసవాసాలను,వీరత్వాన్ని ధీరత్వాన్ని నెమరు వేసుకుంటూ ఆయన చూపిన దారిలో నడవవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.వచ్చే సంవత్సరం వరకు జుక్కల్ మండల కేంద్రంలో భవ్యమైన విగ్రస్థాపన చేయటం జరుగుతుందన్నారు.చత్రపతి శివాజీమహారాజ్ జయంతి సందర్భంగా మరాఠా సమాజంతోపాటు,స్థానిక అధికారులు,ప్రజాప్రతినిధులు,కులమతాలకు అతీతంగా రాజకీయనాయకులు, యువకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మిఠాయి పంపకం చేశారు.
