జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను…

జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాను…

హైకోర్టున్యాయమూర్తి తిరుమలా దేవి
జిల్లా న్యాయస్థానం పని తీరు అభినందనీయం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కొల్లాపూర్ తాలూకా చిన్నంబావి మండలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, నాగర్ కర్నూల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తిరుమలా దేవి పేర్కొన్నారు. జ్యూడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహణలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె జ్యూడిషల్ ఆఫీసర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ జిల్లా కోర్టులకు నేను పరిపాలన న్యాయమూర్తిగా నియామకం అయిన తర్వాత నిర్వహిస్తున్న కార్యక్రమానికి జ్యుడీషియల్ ఆఫీసర్స్ అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడం అభినందనీయమనీ అన్నారు. దీనికోసం కృషి చేసిన జిల్లా జడ్జి రమాకాంత్ ను అభినందించారు.

అంత కంటే ముందు గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోనీ నాగర్ కర్నూల్ తో పాటు కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట కోర్టు లలో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు న్యాయ వాదులు చాలా బాగా సహకరించారని, కేసు రెడీ నా అని అడిగితే అంతే ఉత్సాహం తో ముందుకు వచ్చి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయ వాదులు పూర్తి సహకారం అందించారని అన్నారు. అయితే నాగర్ కర్నూల్ పట్టణంలో ఉన్న కోర్టు బిల్డింగ్ కొత్తగా అదనపు అంతస్తు నిర్మాణం జరుగుతుండటం ఆగస్ట్ మాసంలోపు న్యాయవాదులు ఒకే ఫ్లోర్ కింద పని చేసుకునే అవకాశం ఉందని అన్నారు.

ఇక కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలలో అదనపు కోర్టు భవన నిర్మాణం చేపట్టాలని అందుకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి సహకారం కావాలని కోరారు. తర్వాత జిల్లాలో ఒక్కటే సబ్ కోర్టు ఉండడం కొంత కేసుల పరిష్కారానికి అంతరాయం ఏర్పడుతుందని, మరొక సబ్ కోర్టు మంజూరు చేస్తే కేసుల సత్వర పరిష్కారానికి వీలవుతుందని అన్నారు. బదులుగా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడుతూ.. కోర్టుల పరిధిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

మీరు చెబుతున్న ప్రపోజల్సు అన్నింటిని అమలు చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లా నుండి ఇప్పటివరకు ఎలాంటి బర్నింగ్ ఇష్యూస్ ఫేస్ చేయలేదని,పెండింగ్ కేసుల పరిష్కారం విషయంలో జుడిషియల్ ఆఫీసర్స్ పనితీరు అభినందనీయంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పోక్సో స్పెషల్ జడ్జి నజీమా సుల్తానా తోపాటు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ ప్రెసిడెంట్ లు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply