Jubilee Hills | ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత

Jubilee Hills | ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఎన్నిక
Jubilee Hills | హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్(V. Naveen Yadav) ఘన విజయం సాధించారు. యూసఫ్ గుడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరిగింది.
కాంగ్రెస్ అభ్యర్థికి 98,988 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74259 ఓట్లు(74259 votes for Maganti Sunitha) లభించగా, బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డికి 17061 ఓట్లు పడ్డాయి. విజేతగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు, డీఈఓ సమక్షంలో రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం అందజేశారు.

