Jubilee Hills | ఇంటిబాట ప‌ట్టిన బీజేపీ అభ్య‌ర్థి దీప‌క్‌రెడ్డి

Jubilee Hills | ఇంటిబాట ప‌ట్టిన బీజేపీ అభ్య‌ర్థి దీప‌క్‌రెడ్డి

  • కొన‌సాగుతున్న జూబ్లీహిల్స్ కౌంటింగ్‌

Jubilee Hills | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ బీజేపీ అభ్య‌ర్థి దీప‌క్‌రెడ్డి(Deepak Reddy) కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటి బాట ప‌ట్టారు. కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దూసుకుపోతున్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్య‌ర్థి గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో అతి త‌క్కువ ఓట్లు బీజేపీకి ప‌డ్డాయి.

ఆరో రౌండ్ పూర్త‌య్యే స‌రికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 38566 ఓట్లు(Naveen Yadav 38566 votes) సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 29007 ఓట్లు ల‌భించాయి. అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 7296 ఓట్లు మాత్రమే సాధించారు. ఏడో రౌండ్ కౌంటింగ్ జరుగుతుండగానే దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయారు.

Leave a Reply