జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… నవీన్ యాదవ్ కు ఛాన్స్ !!

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. నవంబర్ 11న ఈ ఉపఎన్నికకు వి. నవీన్ యాదవ్‌ను తమ అధికారిక అభ్యర్థిగా ఏఐసీసీ (AICC) బుధవారం రాత్రి ఖరారు చేసింది. గతంలో ఎంఐఎం (MIM) తరఫున పోటీ చేసి ఓటమి చెంది, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్, స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన మాగంటి గోపీనాథ్ (62) అనారోగ్యంతో మరణించడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఇప్పటికే రంగంలో ఉన్నారు. దీంతో నవీన్ యాదవ్ – మాగంటి సునీత మధ్య నేరుగా పోటీ ఉండ‌నుంది. బీజేపీ అభ్యర్థిని రెండు రోజుల్లో ఖరారు చేయనుంది.

ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది, ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెల్లడికానున్నాయి.

Leave a Reply