సోలార్ ప్రాజెక్ట్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్
( నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో) నంద్యాల జిల్లాలోని పాణ్యం, కందికాయలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించే ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టు కు కేటాయించిన భూమిని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 68 ఎకరాల భూమి కేటాయించినట్టు వివరించారు.
ఈ భూముల్లో ఆక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ భూమికి హద్దులు మ్యాపులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి పలు సూచనలు సలహాలను రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్ , తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సోలార్ ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

