ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ నెల 30న శనివారం ఉదయం 09:00 గంటలకు గుడివాడలోని ANR College లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ తెలిపారు.

ఈ జాబ్ మేళాలో, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్, జోయా లుక్కాస్ జ్యూవెలరీ, మెకనర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, బిగ్ సి మొబైల్స్, జేసీ గ్రాఫిక్స్ లిమిటెడ్, కురాకు ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్, క్వెస్ కార్ప్ లిమిటెడ్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ర్యాపిడో తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలోని ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.టెక్, బీ.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఆగష్టు 30న నిర్వహించే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు.

ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https:// naipunyam.ap.gov.in/ user-registration లింక్ లో తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమ్ లు, బయోడేటా లు ఆధార్, ఆధార్ కు లింక్ చేసిన ఫోన్ నంబర్, PAN , సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 96666 54641, 98488 19682 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply