Jesus the Lord | ప్రభువు ప్రేమ, క్షమాగుణం ఎంతో ఘనమైనవి

Jesus the Lord | ప్రభువు ప్రేమ, క్షమాగుణం ఎంతో ఘనమైనవి

  • మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

Jesus the Lord | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : యేసు ప్రభువు ప్రేమ, క్షమాగుణం ఎంతో ఘనమైనవని, సర్వ మానవాళికి స్ఫూర్తి అని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ(Kokkirala Surekha) అన్నారు. ఈ రోజు పట్టణంలోని సీ ఎస్ ఐ, ఉత్కూర్‌లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలకు హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలందరూ యేసు ప్రభువు(Jesus the Lord) బోధించిన మార్గంలో నడిచి సమాజంలో మంచి పౌరులుగా రాణించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్(Christians) అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి పని చేస్తుందని తెలిపారు.అనంతరం పలువురు పేదలకు నగదు దానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణం,ఆరీఫ్,అశోక్,వెంకట స్వామి,నవాబ్ ఖాన్, రమేష్, నర్సయ్య, శ్రీనివాస్, సత్యన్న,వెంకటేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply