Jeevan Reddy | తీవ్ర ఆగ్రహం..

Jeevan Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నాపై కోపం ఉంటే చర్యలు తీసుకోండి.. కానీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకు కాకుండా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనుషులకే బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు.

జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను విస్మరించారని, ఇది వారి గొంతు కోయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏమైనా కోపం ఉంటే నా మీద చర్యలు తీసుకోవాలని.. కానీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం చేయకండని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులకే కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు కట్టబెట్టారని, దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply