ఎన్డీయే కూటమి ఆద్వర్యంలో నేడు విజయవాడలో (శుక్రవారం) సాయంత్రం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ తిరంగా యాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ర్యాలీ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఏపీకి చెందిన తెలుగు సైనికుడు మురళీ నాయక్ పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం పోందారిన గుర్తు చేశారు. ఆ జవాన్ త్యాగానికి దేశం రుణపడి ఉందని చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత రక్షణ దళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు.
ఇక, జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది… జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతానికి చెందినవారు కావడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.