Jathara | విద్యుత్ సమస్యలు లేకుండా..

Jathara | విద్యుత్ సమస్యలు లేకుండా..
Jathara, ఇంద్రవెల్లి,15, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కిస్లాపూర్ నాగబ జాతర ఏషియాలోనే రెండవ జాతరగా పేరుగాంచిన ఈ జాతర ఈనెల 18న మహా పూజ కానుంది. ఈ జాతరకు విద్యుత్ సమస్యలు లేకుండా స్థానిక ఏఈ జాదవ్ రోహిదాస్ విద్యుత్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు అవసరమయ్యే లూస్ లైన్లను మరమత్తు చేసి వీఐపీ కొరకు మిడిల్ పోల్స్ లను నూతనంగా వేసి సప్లై ని ఓకే చేశారు.
అలాగే నాగోబా ఆలయానికి విద్యుత్ సప్లై కి విద్యుత్ శాఖకు ఆదాయం సంవత్సరం పాటు, లక్ష యాభై వేలు రాగా, లక్ష ముప్పై వేలు, జాతర లోకల్ సప్లై కొరకు వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో విద్యుత్ సరఫరా నేరుగా అందుతుందన్నారు. ఈ సందర్భంగా గుత్తేధర్ అనిల్, సిబ్బంది ఎలై రమేష్, అఫ్రిది, షేక్ షరీఫ్, గుతేదారు బాబాలు పాల్గొన్నారు.
