January 26 | రెపరెపలాడిన త్రివర్ణ పతాకం..

January 26 | రెపరెపలాడిన త్రివర్ణ పతాకం..
January 26, బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సోమవారం త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు యువజన సంఘాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పలు పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు పలు గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నాయకులను స్మరించుకున్నారు.
మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు కనుల పండగ కొనసాగాయి. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామ సచివాలయాలలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళల వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు.
