కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి

కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి

జన్నారం,ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ ప్రజల సహకారంతో గ్రామ సర్పంచి సుతారి సుమలత-వినయ్ కుమార్ ఆదివారం కోతులను పట్టించి అడవిలో నీరు ఉన్న ప్రదేశంలో విడిచి పెట్టించారు.గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతుల బెడదను తీర్చడానికి గ్రామ సర్పంచి ముందుకు వచ్చి చొరవ తీసుకొని కోతులు పట్టే వారిని నెల్లూరు నుంచి రప్పించి కోతులను ప్రత్యేక బోను ద్వారా పట్టించి అడవిలో వదిలివేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్, నగేష్, మల్లేష్,ఎల్. నందు నాయక్, దాసరి చంద్రయ్య, భీమయ్య రాజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచిని పలువురు ప్రజలు ప్రశంసించారు.

Leave a Reply