హైదరాబాద్ : హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఈసారి అత్యంత వైభవంగా జరగనున్నాయి. బంజారా హిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధా గోవింద ఆలయంలో ఆగస్టు 15 (శుక్రవారం), 16 (శనివారం) తేదీల్లో భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఈ సంవత్సరం భక్తులు శ్రీకృష్ణుడిని పలు దివ్యరూపాలలో దర్శించుకునే సువర్ణావకాశాన్ని పొందనున్నారు. శ్రీ లడ్డూ గోపాల్‌కి ఝూలన్ / ఊంజల సేవలో పాల్గొనే ప్రత్యేక అవకాశం అందించబడుతుంది.
ఉత్సవాల ముఖ్యాంశాలు & షెడ్యూల్
15 ఆగస్టు 2025 – శుక్రవారం
దర్శనం: ఉదయం 7:15 – రాత్రి 9:30
- ఝూలన్ / ఊంజల సేవ – ఉదయం 7:15 నుండి రాత్రి 9:30 వరకు
- అభిషేకం – మధ్యాహ్నం 4 నుండి రాత్రి 9 వరకు
- విశేష అర్చన – ఉదయం 8 నుండి రాత్రి 9 వరకు
- మహాభిషేకం, హారతి & ఝూలన్ సేవ – రాత్రి 7:30 నుండి 10:00 వరకు
16 ఆగస్టు 2025 – శనివారం
దర్శనం: ఉదయం 6:00 – రాత్రి 1:00 (అర్థరాత్రి వరకు)
- ఝూలన్ సేవ – ఉదయం 6:00 నుండి రాత్రి 10:30 వరకు
- అభిషేకం – ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు
- శ్రీ రాధా గోవిందులకు రోజు పొడవునా 4 విస్తృత అభిషేకాలు
- 108 కలశాల విశేషాభిషేకం & ప్రవచనం – సాయంత్రం 6:00 నుండి 8:00 వరకు
- మహా హారతి & ఝూలన్ – రాత్రి 8:00 నుండి 9:00 వరకు
- ప్రత్యేక అర్థరాత్రి అభిషేకం (108 కలశాలతో) – రాత్రి 10:30 నుండి
- మహామంగళ హారతి – రాత్రి 12:00 నుండి 1:00 వరకు
ఆగస్టు 15, 16 తేదీల్లో సాయంత్రం జరిగే ప్రత్యేక సంధ్యా మహాభిషేకం భక్తులకు దివ్యానుభూతి కలిగిస్తుంది. ఆగస్టు 16 తేదీన 10.30 గంటలకు 108 కలశాలతో శ్రీ రాధా గోవిందులకు ప్రత్యేక అభిషేకం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి వేళ మహామంగళ హారతి జరగడం ఈ ఉత్సవాలకే ప్రధాన ఆకర్షణ నిలుస్తుంది
17 ఆగస్టు 2025 – ఆదివారం
నందోత్సవం & వ్యాసపూజ మహోత్సవం
- దర్శనం: ఉదయం 8:00 – రాత్రి 9:00
- శ్రీల ప్రభుపాదుల 129వ జయంతి వేడుక – సాయంత్రం 6:00 గంటలకు
- శృంగార హారతి, నూతన వస్త్రాలు, పుష్పాలంకరణ, విశేష నైవేద్యం
- చప్పన్ భోగం (56 రకాల నైవేద్యాలు) సమర్పణ
- శ్రీ నరసింహ హోమం, రాజభోగ హారతి
సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తి, సనాతన సంప్రదాయాలను ప్రతిబింబించే హరే కృష్ణ ఛాలెంజ్, కృష్ణ కిడ్స్, జప క్లబ్, సాంప్రదాయ నృత్య–గాన సేవలు నిర్వహించబడతాయి.
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ భక్తులందరికీ ఆహ్వానం అందిస్తూ “ఈ భవ్యమైన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలకు హాజరై శ్రీకృష్ణుని కృపను పొందండి” అని కోరారు.
ఇతర కేంద్రాల్లో కూడా ఉత్సవాలు
- హరే కృష్ణ హెరిటేజ్ టవర్ – నార్సింగి
- హరే కృష్ణ కల్చరల్ సెంటర్ – కంది, సంగారెడ్డి
ఆగస్టు 16న జన్మాష్టమి, 17న నందోత్సవం, వ్యాసపూజ మహోత్సవాలు భక్తిపూర్వకంగా జరుగుతాయి.


