ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; సమాజంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మండలంలోని జంగంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు అన్నారు. ఆదివారం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రకాష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమత సత్యం, నాయకులు రవీందర్, బాలయ్య, నందు తదితరులు ఉన్నారు.
