Janagao | కెసిఆర్ కృషితోనే జ‌న‌గామ జిల్లా ఏర్పాటు … ఎమ్మెల్సీ క‌విత

జ‌న‌గామ – జనగామ జిల్లా ఏర్పడిందంటే అది మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైందని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. జనగామ జిల్లాలో నేడు పర్యటిస్తున్న క‌విత ముందుగా పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను సందర్శించారు. పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పెంబర్తి పర్యటన అనంతరం జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసే లాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ బిడ్డలకు లాభం చేసేలాగా, బీసీ బిల్లులు పెట్టేలాగా మనందరం ఐక్యంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

‘జనగామ జిల్లా ఏర్పడిందంటే అది కేసీఆర్ కృషితోనే. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. అభివృద్ధికి బాటలు పడ్డాయి. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ ఇలా అన్ని రకాల అభివృద్ధి జరిగిందంటే అది కేసిఆర్ ప్రభుత్వంతోనే. పెంబర్తిలో ఉన్న హస్తకళల సెంటర్ పరిశీలించాను. ఉచిత బస్సు పెట్టారు కానీ.. పెంబర్తిలో బస్సు ఆగుతలేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెంబర్తి గ్రామంలో బస్సులు ఆగాలి’ అన్నారు.

‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ మాట ఇచ్చింది. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసేలాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ బీసీల గురించి చెబుతుందంటే దాన్ని కారణం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ చేసిన ఉద్యమమే కారణం. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ రిజర్వేషన్ల కోసం వేరువేరు బీసీ బిల్లులు పెట్టాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్లీ రీసర్వే చేస్తామని చెప్తున్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ రీసర్వే చేయండి. హైదరాబాదులో 40 శాతం ఇళ్లులు రాలేదని జనం చెబుతున్నారు. ఎవరైతే మిస్సయ్యారో వాళ్ళందరికీ తెలిసే లాగా విస్తృతంగా ప్ర‌చారం చేయండి. ఉపకులాలు చేర్చుకునే లాగా అవకాశం కల్పించండి. బీసీ బిల్లు పెడతామని కాంగ్రెస్ చెప్పడం మన తొలి విజయం మాత్రమే. బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ బిడ్డలకు లాభం చేసేలాగా బీసీ బిల్లులు పెట్టేలాగా మనందరం ఐక్యంగా ఉద్యమం చేయాలి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *