• కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు..!
  • రాష్ట్రపతితో మోడీ, అమిత్ షాల భేటీ నేపథ్యంలో ఊహాగానాలు


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)తో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)లు ఆదివారం వరుసగా భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ముర్ముతో ఎందుకు భేటీ అయ్యారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే కేంద్రపాలిత ప్రాంతమైన (Union Territories) జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంపై చర్చించేందుకే సమావేశమైనట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ముర్ముతో భేటీ అనంతరం అమిత్ షా కొందరు జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) నాయకులతోనూ భేటీ అయినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 5న ఆర్టికల్ 370 (Article 370) రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతుంది. దీనికి కొద్ది రోజుల ముందే ఈ సమావేశాలు జరగడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

నేడు ఎన్డీఏ ఎంపీలతో మోడీ భేటీ..!
ఇదే విషయంపై ప్రధాని మోడీ మంగళవారం ఎన్డీఏ ఎంపీలతోనూ కీలక సమావేశాన్ని (key meeting) కూడా ఏర్పాటు చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశంపైనే చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడానికి ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకురాబోతోందా అనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం జమ్మూ కశ్మీర్, లఢఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అనంతరం పదేళ్ల తర్వాత కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ నేప‌థ్యంలో కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే దీనిపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply