బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి జంబి లక్ష్మి వెంకటి, ప్రజల మద్దతుతో గెలుపు బాటలో ముందుకు పోతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కార్కూరి రాంచందర్ చెప్పారు.
అభ్యర్థి గెలుపుతో మహిళా అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు కొత్త గీతగా మారుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా, ఇందిరమ్మ ఇళ్ళు, స్వసక్తి సంఘాల మహిళలకు రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, మరియు మహిళలకు ప్రతి విషయంలో ప్రాధాన్యం కల్పిస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల సంక్షేమానికి కృషి చేస్తోందని రాంచందర్ తెలిపారు.
ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని మరియు టీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులును తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నలిమెల కృష్ణస్వామి, మార్త బాబు, పనాస శ్రీనివాస్, దుర్గం రాజన్న, కందుల సత్యం, జక్కం రాజయ్య, జునుగురు జోగయ్య, మహిళా నాయకులు జంబిబాయమ్మ, జంబి కృష్ణవేణి, జంబి అన్నపూర్ణ, బియ్యాల జ్యోతి, కందుల భారతి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

