Jaipur | మారథాన్ పోటీల్లో ఇందారం వాసి

Jaipur | మారథాన్ పోటీల్లో ఇందారం వాసి

Jaipur | జైపూర్, ఆంధ్రప్రభ : ఆసియా ఖండంలో అతిపెద్ద మారథాన్ పోటీలో మంచిర్యాల జిల్లా జైపూర్ ఇందారం వాసి పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి మాసంలో టాటా గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మారథాన్ పోటీలో ఇందారం వాసి సంకటి సంతోష్ పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోక్యాం స్లామ్ ఆధ్వర్యంలో నిన్న ముంబై నగరంలో నిర్వహించిన 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో సంతోష్ 3 గంటల 56 నిమిషాల వ్యవధిలో తన లక్ష్యాన్ని పూర్తిచేసి మెడల్ దక్కించుకున్నారు. గతంలో సంతోష్ వివిధ నగరాల్లో నిర్వహించిన మారథాన్ పోటీలో పాల్గొని నిర్ణీత సమయంలో పోటీని పూర్తిచేసినట్లు తెలిపారు. మారథాన్ పూర్తి చేయాలంటే క్రమశిక్షణ, నిరంత సాధన అవసరమని పేర్కొన్నారు. తను మెడల్స్ కోసం కాదని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికే ఈ మారథాన్ పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంతోష్ అభినందించారు.

Leave a Reply