Jagtial | జిల్లాకు చెందిన మావోయిస్టుల లొంగుబాటు

Jagtial | జిల్లాకు చెందిన మావోయిస్టుల లొంగుబాటు

Jagtial | జగిత్యాల, ప్రతినిధి : ఎంఎంసి జోన్ ప్రతినిధి (MMC Zone Representative) అనంత్ అలియాస్ వికాస్ జనవరి 1న లొంగిపోతామని మీడియాకు లేఖ విడుదల చేసిన మరునాడే తనతో పాటు మరో పది మంది మావోయిస్టులతో మహారాష్ట్రలోని గోండియాలో గడ్చిరోలి జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంకిత్ గోయల్ సమక్షంలో లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. అంకిత్ పై రూ.25లక్షల రివార్డ్ ఉందని గోండియా జిల్లా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల (Maoists) పై రూ.89 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2005లో లొంగుబాటు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. గోండియా జిల్లాలో ఇప్పటి వరకూ 37మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అనంత్ తో పాటు మరో పది మంది మొత్తం 11మంది మావోయిస్టుల లొంగుబాటు జరిగిందన్నారు.

కొందరు ఆయుధాలతో లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన వ్యక్తి. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, ఏసిఎం, దళ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ కు చెందిన అనంత్ అలియాస్ వినోద్, జగిత్యాల జిల్లా రాయుకల్ మండలం సింగరావుపేటకు చెందిన బత్తుల కాశిరామ్ అలియాస్ ప్రతాప్ అలియాస్ సమర్ లు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో కాశీరామ్ పై పలు కేసులున్నాయి. మిగిలిన వారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు. లొంగిపోయిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు. అనంత్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మాజీ మావోయిస్ట్ సాయులు కొడుకు, సాయులు అనారోగ్య కారణాలతో గతంలో లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత సాయులు మృతిచెందాడు.

Leave a Reply