jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్ప‌ల్‌ ఫ్లై ఓవర్ నిర్మాణం

jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్ప‌ల్‌ ఫ్లై ఓవర్ నిర్మాణం

  • ఫ్లైఓవ‌ర్ ప‌నులను ప‌రిశీలించిన క‌విత‌

jagruti kavita| హైద‌రాబాద్ క్రైమ్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఉప్ప‌ల్ ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌ను 14 ఏళ్లుగా కొన‌సాగుతున్నాయ‌ని, ప్ర‌భుత్వాలు మారుతున్నా ఉప్ప‌ల్ ప్ర‌జ‌ల ప‌రిస్థితి మార‌టం లేద‌ని జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మేడ్చల్ – మల్కాజ్ గిరి(Medchal – Malkaz Giri) జిల్లాలో నాలుగు రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ(flyover construction) పనులను ఆమె ప‌రిశీలించారు.

jagruti kavita

ఉప్ప‌ల్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జి అంశంపై తాను శాస‌న మండ‌లిలో ప్ర‌శ్నిస్తే ఆర్అండ్ బీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) స్పందించి త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ను మార్చారో లేదో తెలియదు కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవడానికి తాము ఇక్కడకు వచ్చామ‌ని అన్నారు.

jagruti kavita |కో – ఆర్డినేషన్ లేకపోవడం కారణంగానే

ఘట్కేసర్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉప్ప‌ల్‌ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నార‌ని, 14 ఏళ్లుగా క‌డుతున్నారంటే ప్ర‌జ‌ల ప‌ట్ల ప్ర‌భుత్వాల‌కు ఏ మాత్రం చిత్త‌శుద్ధి ఉందో తెలుస్తోంద‌ని క‌విత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కో – ఆర్డినేషన్(Co – Ordination) లేకపోవడం కారణంగానే ఆలస్యమవుతోంద‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాల‌ని కోరారు. ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడకు వచ్చి పరిస్థితిని చూడాలని సూచించారు.

jagruti kavita

సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాల‌ని క‌విత కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Govts) సమన్వయంతో త్వరిత గతిన పనులు పూర్తి చేయాల‌న్నారు. లేకుంటే త‌మ సంస్థ త‌రుఫున తామే ప్ర‌భుత్వం వెంట‌ప‌డి ప‌నులు చేయిస్తామ‌ని చెప్పారు.

click here to read 16 Villages| సర్పంచ్ అభ్యర్థులు వీరే..

Click Here To Read More

Leave a Reply