ఘనంగా జగ్జీవన్ రామ్ 119వ జయంతి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశ ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక సమానత్వం, దళితుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఏక్బాల్, జైనూర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడి మేత విశ్వనాథ్ రావు, ముక్కాడే ఉత్తం, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు మరుసుకోల తిరుపతి, కొత్తపెల్లి మహేందర్, బిరుదుల లాజర్, స్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
