jagga Reddy | జీవన్ రెడ్డికి గౌరవం కల్పించాలి

jagga Reddy | జీవన్ రెడ్డికి గౌరవం కల్పించాలి
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
jagga Reddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మీడియా ద్వారా తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు పొందినప్పటికీ, పరిస్థితులు అనుకూలించక జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి అండగా నిలిచారని గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా నిబద్ధతతో ముందుకు సాగిన నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. అలాంటి నాయకుడికి ఎలాంటి అవమానం జరగకుండా పార్టీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చొరవ చూపాలని కోరారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి తగిన గౌరవం లభించే విధంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంఛార్జి, పీసీసీ ప్రెసిడెంట్‌లకు ఈ సందర్భంగా జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.
