జగన్ అనుకూల అధికారి కొర్రీ
- జనసేన నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: నాగాయలంక మండలం ఎదురుమొండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వం(TDP Govt)లో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రీ పెట్టారని బుద్ధప్రసాద్ ఆరోపించారు. అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
స్నేహితుడైన నాబార్డ్ చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తెచ్చారని, నాబార్డ్ చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్(Simhadri Ramesh) చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగిందన్నారు. నాబార్డ్ కేటాయించిన రూ.109 కోట్లలో కొంత జగన్ పథకాలకు మళ్లించారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎదురుమొండి బ్రిడ్జికి సాస్కి నిధులు ఇస్తున్నారన్నారు.
గత ప్రభుత్వంలో ఎంపీ బాలశౌరి నిధులు తెస్తే సింహాద్రి రమేష్ తీరుతో సఫలం కాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రూ.100 కోట్ల మేలు చేయనున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కృషితో ఎదురుమొండి బ్రిడ్జి, ఔట్ ఫాల్ స్లూయీజులు, గొల్లమంద రోడ్డు, సాగర సంగమ అభివృద్ధి సాకారం కానున్నట్టు వివరించారు.

