వెలగపూడి : నా బీసీలు అంటూ గొప్పలు చేప్పిన వైఎస్ జగన్ ఐదేళ్లలో బీసీలకు ద్రోహం చేశారని మంత్రి సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే రూ. 1977 కోట్లు స్వయం ఉపాధి పథకాలకే అమలు చేశామన్నారు. రూ. 200 కోట్లతో 1 లక్ష 2 వేల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బీసీల కోసం కార్పోరేషన్ల కింద సబ్సిడీపై రుణాలు అందిస్తున్నా మని, ఆదరణ పథకానికి రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు కట్టబోతున్నామని , బీసీ హాస్టళ్లు, గురుకులాలు మరమ్మతులు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
AP | నా బీసీలంటూ వారికి జగన్ శఠగోపం… సవిత
