Jagan | ఆరంభంలోనే వైసీపీ సభ్యులు..

Jagan | ఆరంభంలోనే వైసీపీ సభ్యులు..
Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

సభా హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

