హైదరాబాద్ ఆంధ్రప్రభ : దేశంలోనే ప్రీమియర్ ఐవీఎఫ్(Premier IVF), ఫెర్టిలిటీ చికిత్సా కేంద్రంగా పేరొందిన ఏఆర్‌టీ ఫెర్టిలిటీ(ART Fertility Clinics India) క్లినిక్స్ ఇండియా సంస్థ తన అత్యాధునిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అందరూ సందర్శించగలిగే డిజిటల్ అనుభవాలతో కూడిన సృజనాత్మక సూట్(Creative Suite)ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగతంగా, డిజిటల్ అనుభవాలను కలగలిపి ఇక్కడకు రావాలనుకున్న పేషెంట్లకు ముందుగానే అన్నీ ఎలా ఉంటాయో చూపించేందుకు ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపొందించారు. తద్వారా దేశంలో ఫెర్టిలిటీ చికిత్సలు మారుతున్న తీరును అందిస్తున్నరు.
ఇందులోభాగంగా ఎంపిక చేసిన దంపతులకు ప్రతి శనివారం వారి అత్యాధునిక ల్యాబ్ సందర్శన ఉచితంగా ఉంటుంది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, అద్భుతమైన ప్రొసీజర్లు(Procedures), వారి భావి పిండాలను కాపాడే విధానాలు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ ఎడ్యుకేషనల్ టూర్ల ద్వారా ఎంబ్రియో ట్రాకింగ్ (Embryo Tracking), గుర్తింపు కోసం క్లినిక్‌లో ఉన్న ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీ(RI Witness Technology) తెలుస్తుంది. దీంతో ఐవీఎఫ్ (IVF) విధానంపై నమ్మకం కలుగుతుంది. ముందెన్నడూ లేనంత భద్రత, పరిశుభ్రమైన హ్యాండిలింగ్, ప్రతి అడుగులోనూ కచ్చితత్వంతో అండాల సేకరణ నుంచి వాటి బదిలీ, పిండాన్ని కాపాడడం వరకు అన్నీ పూర్తి భద్రతతో చేస్తారు.
సాంకేతికతతో కూడిన ఈ కచ్చితత్వం, విస్తృతమైన వైద్య నైపుణ్యం, రోగుల సమగ్ర సంరక్షణ వీటన్నింటివల్ల ఫలితాలు అద్భుతంగా వస్తాయి. దేశంలోనే అత్యధిక లైవ్ బర్త్ రేట్ల(Live Birth Rates)ను ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్(ART Fertility Clinics) నిరంతరం అందిస్తోంది.
పేషెంట్ ఎక్స్‌పీరియన్స్(Patient Experience) ఆవిష్కరణ సందర్భంగా ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా ప్రాంతీయ అధిపతి గురుసిమ్రన్ కౌర్ మాట్లాడుతూ “ప్రారంభ సమయం నుంచి ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా రోగులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తల్లిదండ్రులు కావడం అనేది దంపతుల కల. వైద్యపరమైన, సంరక్షణ సేవలే కాదు, పూర్తిస్థాయి మద్దతు, అవగాహన, అత్యాధునిక సాంకేతికతలను ఈ చికిత్సలో భాగం. విజ్ఞానం అందడంలో అంతరాలను అంతం చేసి, రోగులందరిలో నమ్మకం కలిగించి, వారికి ఈ ప్రయాణంలోని ప్రతి అడుగులోనూ ప్రోత్సాహం అందించి, వాళ్లకు అవసరమైన, పొందాల్సిన ఫెర్టిలిటీ(Fertility) చికిత్సలు అందిస్తాం” అని తెలిపారు.