ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి..

ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి..
ఆళ్ళపల్లి, ఆంధ్రప్రభ : క్రీడలతో క్రీడాకారుల నడుమ స్నేహసంబంధాలు ఎక్కువగా పెరుగుతాయని, గెలుపుతో లోపాలు వెలుగులోకి రావని, ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయని సీపీఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా అన్నారు. ఆళ్ళపల్లి మండల కేంద్రంలో గత 8 రోజుల పాటు జరిగిన ఆర్పీఎల్ లీగ్ టోర్నమెంట్ క్రికెట్ ఫైనల్లో విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాబీర్ పాషా హాజరై, విజేతగా నిలిచిన తౌహిద్ బెంగాల్ టైగర్స్ టీంకి షీల్డ్ తో పాటు రూ.20 వేల నగదును ఆయన అందజేశారు. దీంతో పాటు రన్నరప్ టీం ఆరిఫ్ వారియర్స్ కు షీల్డ్ తో పాటు రూ.12 వేల నగదు అందచేశారు.
ఈ లీగ్ టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్ మన్ గా తేజ, బెస్ట్ బౌలర్ గా స్టాలిన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ నవీన్ గెలుచుకున్నారు. ఈ ఆర్పీఎల్ లీగ్లో 5 టీముల క్రీడాకారులకు జెర్సీలు మహమ్మద్ నయీమ్, సయ్యద్ అల్తాఫ్, మానాల శ్రావణ్ కుమార్, ఎండీ.అఫ్రోజ్, షేక్ మొక్తియార్ హుస్సేన్ లు అందించగా, లీగ్ టోర్నీ విజయవంతం అవడానికి స్థానిక ప్రముఖ వ్యాపారవేత్తలు గ్రామీణ వైద్యులు, అభయాంజనేయ గౌరవ అధ్యక్షులు, వాసవి క్లబ్ మాజీ మండల అధ్యక్షులు, ఆర్యవైశ్య మండల అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మిక పూజారి అబ్బు నాగేశ్వరరావు, బూరుగడ్డ రాములు, లైన్మెన్ అడప జగన్నాథం, ఆర్థిక సంఘ సామాజిక సహాయ దాత, నేహా ఎర్త్ మూవర్స్ మహమ్మద్ మొక్తియార్ హుస్సేన్ పాషా, నరెడ్ల వెంకన్న, కుమార్, నువ్వుల నరసింహారావు, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రముఖ వ్యాపారవేత్త నరెడ్ల శ్రీనివాసరావు, సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆరిఫ్, ఎండీ.మునాఫ్, తదితరులు ఆర్థిక సహాయం అందజేశారు.
క్రీడాకారులకు ఆర్పీఎల్ మేనేజ్మెంట్, క్రీడాకారుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు స్థానిక వైస్ ఎంపీపీ గ్రామ పెద్దలు రేసు ఎల్లయ్య, పెద్దవెంకటాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ వజ్జా ఉమ, మండల సహాయ కార్యదర్శి నరెడ్ల రాంబాబు, మండల నాయకులు దీకొండ మల్లేష్, కుంట సహదేవ్, వజ్జ పగడయ్య, తాటి ఎల్లయ్య, చిరంజీవి, మండల కార్యదర్శి కొమరం హనుమంతరావు, లాజర్, సీపీఐ మండల సోషల్ మీడియా కసనబోయిన నరేష్, ఎల్లబోయిన నవీన్, షేక్ రహీం, ఆళ్ళపల్లి ఉప సర్పంచ్ సయ్యద్ ఆరిఫ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ హఫీజ్, బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ నాయకులు మహమ్మద్ ఆదామ్, ముఖ్య క్రీడాకారులు హనీఫ్, నదీమ్, సాబీర్, నవీన్, సాయి, తేజ, చింటు, నవీన్, ఖలీల్, సత్తార్, రోషన్, నాగేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
