జగిత్యాల, ఆంధ్రప్రభ : కాళేశ్వరం (Kaleshwaram) విషయమై సీబీఐ విచారణకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు.
ఈ రోజు జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శతకు నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి సిట్ ను నియమించి విచారణ చేపట్టే అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐ (CBI) కి కాళేశ్వరం విచారణ అప్పగించి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా వ్యవహారిస్తుందన్నారు. కాళేశ్వరం విషయంలో వాస్తవాలు ప్రజలు గ్రహించాలన్నారు.