ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆగిపోయిన యుద్ధాలన్నిటికీ తానే కారణమని పదేపదే పాతపాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి మాత్రం కాస్తంత సీరియస్ గానే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే రెండో దఫా జెలెన్ స్కీతో చర్చలు కూడా జరిపారు. మొదటిసారి లాగా కాకుండా ఈసారి చర్చల్లో చాలా కూల్ గా నవ్వుతూ-అందరితో జోవియల్ గా కనిపించారు కూడా.అలాగే పుతిన్-జెలెన్ స్కీ తో కలిపి త్రైపాక్షిక చర్చలు కూడా ఉంటాయని ప్రకటించారు. ఆ శాంతి చర్యలు-చర్చలపై తాను సీరియస్ గా ఉన్నానని సంకేతాలివడ్డానికో-ఏమో, ఇవి సఫలీకృతమైతే తనను స్వర్గానికి తీసుకెళ్తాయని చమత్కరించారు. నోబెల్ శాంతి బహుమతి గెల్చుకునేందుకే ఇవన్నీ చేస్తున్నానని గతంలో చెప్పిన ట్రంప్, ఈసారి ఏకంగా స్వర్గం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ మధ్య తరచు దైవభక్తి కూడా ప్రదర్శిస్తున్నారు ట్రంప్..అదంతా వట్టిదేనని కొంతమంది ఆయన వ్యతిరేకులు కొట్టిపారేస్తున్నారు…ఎందుకంటే నిజంగా ట్రంప్ లో అంత ఆధ్యాత్మిక చింతన పెరిగితే, ఈ దూకుడు..ఈ ప్రతీకార ధోరణులేంటని వారు ప్రశ్నిస్తున్నారు…అదీ పాయింటే కదా….
యుద్ధం ఆపి స్వర్గానికి పోతా..
