irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News

irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News
తినే పిల్లలు తక్కువ
పుస్తకాల్లో ఎక్కువ
మిడ్ మీల్ బియ్యం స్వాహా
ఇదీ కొండపల్లి జెడ్పీ హైస్కూలు గతి
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ తనిఖీలో తేటతెల్లం
( ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ)
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో (Midday meal) మధ్యాహ్న భోజన పథకాన్ని విజిలెన్స్ కమిటీ సభ్యులు తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా కొండపల్లి జడ్పీ బాలికల హైస్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని సబ్ కలెక్టర్ కె.చైతన్య, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ మెంబర్ పచ్చిగోళ్ల ఆనంద కీర్తి గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు నాణ్యతా లోపంతో, (irregularities) తక్కువ పరిమాణంలో విద్యార్థినులకు భోజనాన్ని అందిస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థినులను నాణ్యతా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
irregularities

ఇళ్ల వద్ద నుంచి భోజనం తెచ్చుకోవడం చూసి ప్రశ్నించారు. నాణ్యతా లోపం వల్ల మధ్యాహ్న భోజనం తినకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నట్లు బాలికలు సమాధానమిచ్చారు. 900 మంది విద్యార్థినులు ఉంటే 300 మంది తింటున్నారని, 700 మందికి భోజనం వండినట్లు రికార్డులో నమోదు చేయడాన్ని గుర్తించారు. దీంతో నిర్వాహకులను నిలదీశారు. ఇదిలా ఉండగా తనిఖీల్లో అనుమానం రావడంతో గురువారం రాత్రి భోజన పథక నిర్వాహకురాలి ఇంటిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె ఇంట్లో పది బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ అనంతరం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆనంద కీర్తి తెలిపారు.
