Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News

Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News
- అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- మధ్యప్రాచ్యంలో మంటలు..
- యుద్ధం మరింత ఉధృతం
- అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవతకం
- ప్రపంచం ఉత్కంఠ
- హౌతీల దాడులు..
- ఇజ్రాయెల్‌పై మళ్లీ మిస్సైళ్లు
- యుద్ధం ఆగేలా లేదు..
- ప్రతి రోజూ కొత్త ట్విస్ట్
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)
అమెరికా దళాలను తిప్పి కొట్టటానికి తమ బలగాలు ‘సిద్ధంగా’ ఉన్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ (Mohammad Bagher Ghalibaf) ఈరోజు, 2026 మార్చి 29 ఆదివారం అమెరికాను హెచ్చరిస్తూ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 30 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Iran Warning : నేల మీద సైతం

అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంపై అడుగుపెడితే, “తగలబెట్టడానికి” (set them on fire) తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఖలీబాఫ్ హెచ్చరించారు. భూ మీద దాడులకు వస్తే అమెరికా సహా ప్రాంతీయ మిత్రదేశాలను శాశ్వతంగా శిక్షించేందుకు ఇరాన్ సైన్యం వేచి ఉందని పేర్కొన్నారు.
Iran Warning : అమెరికా రెందందల వ్యూహం

అమెరికా బయటకు శాంతి చర్చలు అని చెబుతూనే, రహస్యంగా ఇరాన్‌పై భూతల దాడికి (Ground Attack) ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు. ఇరాన్ తన దాడులను కొనసాగిస్తుందని, తమ వద్ద మిస్సైళ్లు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని,

దాడులను ఎదుర్కోవడంలో తమ నమ్మకం మరింత బలపడిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా చర్చల పేరుతో ఒక 15 పాయింట్ల జాబితాను పంపిందని, యుద్ధంలో సాధించలేని అంశాలను ఈ నిబంధనలతో పొందాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
Iran Warning : మధ్య ప్రాచ్యం అతలాకుతలం

అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఎథిక్ ప్యూరీ రెండవ నెలలోకి ప్రవేశించడంతో, యావత్తు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో అతలాకుతలం అవుతోంది. తాజా దాడులు, జనం మరణాలు, నిరసనలు, దౌత్య ప్రయత్నాలు వేగంగా ట్విస్టులు మీట్విస్టులు మరిపిస్తున్నాయి.
Iran Warning : హౌతీలు సైతం…

ఇజ్రాయెల్‌పై యెమెన్‌లోని హౌతీలు రెండవ విడత క్షిపణులు, డ్రోన్ దాడులు నిర్వహించారు. తమపై ఇజ్రాయెల్ దాడులను, దురాక్రమణను ఆపే వరకు తాము ఆగేది లేదని హౌతీలు శపథం చేశారు. ఇక చర్చల కోసం దౌత్యపర చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులను ఆపలేదు. బుషెహర్ ప్రావిన్స్‌లో నలుగులరు ఒకే కుటుంబ సభ్యులు మరణించారని, ఖుజెస్తాన్లోని ఒక నీటి కేంద్రంపై దాడి జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఇందుకు ప్రతీకారంగా పశ్చిమ ఆసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలపై దాడులు చేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది.
Iran Warning : టెల్ అవీవ్‌లో… నిరసన

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో యుద్ధ వ్యతిరేకు నిరసన వ్య క్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది మందితో పోలీసులు ఘర్షణ పడ్డారు. అదే సమయంలో, అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా “రాజు వద్దు” అంటూ లక్షలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. వీరిలో చాలామంది ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించారు. క్షిపణి, డ్రోన్ ముప్పులకు వ్యతిరేకంగా సహకారంపై దృష్టి సారించిన ఒక రక్షణ ఒప్పందంపై ఖతార్ , ఉక్రెయిన్ సంతకాలు చేశాయి. బహ్రెయిన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్యూమినియం కర్మాగారాలపై ఇరాన్ దాడులకు దిగింది. ఈ కర్మాగారం దెబ్బతిన్నట్గు నివేదికలు వచ్చాయి.
Iran Warning : ముగ్గురు జర్నలిస్టుల హత్య
ఇక లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు ముగ్గురు జర్నలిస్టులను హత్య చేసిన తర్వాత, బీరుట్లో నిరసనలు చెలరేగాయి. ఈజిప్ట్ , టర్కీ విదేశాంగ మంత్రులు ప్రాంతీయ చర్చల కోసం పాకిస్తాన్ రాజధానికి చేరుకున్నారు. అ తన దేశంపై అమెరికా ఇజ్రాయెల్ “దురాక్రమణ”ను అడ్డుకోవడానికి ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రశంసించారు.
