Iran | అగ్రనేత లారీజానీ మృతిపై..

Iran | అగ్రనేత లారీజానీ మృతిపై..
Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారీజానీ మృతి పట్ల ఆదేశ అగ్రనేతలు వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ను శాసిస్తూ వస్తున్న ఆ దేశ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారీజానీ మృతిని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఆయన మృతి పట్ల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా ఉన్నతాధికారులు ఘన నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే ఆయన మరణానికి తీవ్రమైన ప్రతీకారాన్ని ఎదుర్కొంటారని ఇరాన్ అగ్రనేతలు వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్కరు మరణించినంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదనీ తమ ప్రభుత్వంగా బలంగా నిర్మితమై ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అలీ లారీజానీ, ఆయన కుమారుడు, ఇతర భద్రతాసిబ్బంది, బసీజ్ దళం చీఫ్ గులం రెజా సొలేమానీ అమరులయ్యారని ఇరాన్ భద్రతామండలి పేర్కొంది. ఇరాన్ పురోగతి, ఇస్లామిక్ విప్లవం కోసం డాక్టర్ లారీజానీ తన జీవితకాలమంతా పోరాటం చేశారన్న మండలి, దేశ సేవలో తరిస్తూ అత్యంత గౌరవప్రదమైన మరణాన్ని సాధించారని తెలిపింది.
రాడార్ల కళ్లుగప్పి దూసుకెళ్తున్న డ్యాన్సింగ్ మిసైల్..
అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాలుగా దాడులు చేసినా.. ఇరాన్ లొంగకుండా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అత్యంత భారీ స్థాయిలో మిసైల్ నిల్వలు కలిగిన దేశం ఇరాన్ మాత్రమే అనే విషయం.. అందరికీ ప్రాక్టికల్‌గా అర్థమవుతోంది.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం, ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. వాటిలో.. కొన్ని మిసైళ్ల సామర్థ్యం, వేగాన్ని బట్టి.. వాటిని బ్రహ్మాస్త్రాలుగా చెబుతున్నారు. అలాంటి మిసైళ్లను ఇరాన్ ఫైర్ చేశాక.. అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల కూడా కాదంటున్నారు. ఇంత పక్కాగా టార్గెట్లను ఛేదించే మిసైళ్లు తమ దగ్గర ఉన్నాయ్ కాబట్టే.. ఇరాన్ ఇంత పక్కాగా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు.. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది.
