Iran | కాన్సులేట్ దగ్గర ఉద్రిక్తత

Iran | కాన్సులేట్ దగ్గర ఉద్రిక్తత

గేటుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లాహోర్‌లో అమెరికా కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమికూడి కాన్సులేట్ గేటును బలవంతంగా తోసి లోపలికి దూసుకెళ్లారు. ఆందోళనకారులు కాన్సులేట్ గేటుకు నిప్పు పెట్టారు. పాకిస్తాన్ పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో జరగడం గమనార్హం. ప్రస్తుతం కాన్సులేట్ పరిసరాల్లో భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Leave a Reply