IPL Record | కేఎల్ రాహుల్ కొత్త రికార్డ్ !

ఈరోజు ఏక‌నా స్టేడియం వేదిక‌గా లక్నోతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ కీల‌క మైలురాయిని చేరుకున్నాడు. నేడు జరిగిన మ్యాచ్‌లో ల‌క్నోపై 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీనితో, ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా అతను నిలిచాడు.

కాగా, ఇప్పటివరకు రాహుల్ ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌లు ఆడాడు. అతను 46.35 సగటుతో 4949 5006 చేశాడు. ఇందులో 4శ‌త‌కాలు, 40 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 132 నాటౌట్‌

ఐపీఎల్‌లో 5వేల ఫ్ల‌స్ ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

  • విరాట్‌ కోహ్లి – 8326 ర‌న్స్‌
  • రోహిత్‌ శర్మ – 6786 ర‌న్స్‌
  • శిఖర్‌ ధవన్ – 6769 ర‌న్స్‌
  • డేవిడ్‌ వార్నర్ – 6565 ర‌న్స్‌
  • సురేశ్‌ రైనా – 5528 ర‌న్స్‌
  • ధోని – 5377 ర‌న్స్‌
  • ఏబీ డివిలియర్స్ – 5162 ర‌న్స్‌
  • కేఎల్ రాహుల్ – 5006 రన్స్

Leave a Reply