క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఉప్పల్ స్టేడియం వరకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 డిపోల నుండి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మార్చ్ 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు వివరించారు.