IPL 2025 | మ‌రికొన్ని రోజుల్లో ఐపీఎల్ పండుగ‌.. ఈ సీజ‌న్ కు దూర‌మైన ఆట‌గాళ్లు వీరే !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 8 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా తెరలేవనుంది. మ్యాచ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది.

అయితే, ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే… గాయాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ప‌రువురు ఆటగాళ్లు ఇప్పటికే పోటీ నుండి వైదొలిగారు. మ‌రి ఈ సీజ‌న్ ఐపీఎల్ కు అందుబాటులో లేని ఆటగాళ్లను ఎవ‌రో చూద్దాం…

హ్యారీ బ్రూక్ (ఢిల్లీ క్యాపిటల్స్)

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని.. IPL 2025 నుండి వైదొలిగాడు. అయితే, గాయం కాకుండా ఇతర కారణాల వల్ల ఆటగాళ్ళు ఐపీఎల్ కి అందుబాటులో లేకుంటే, వారిని రెండు సీజన్ల పాటు సస్పెండ్ చేస్తామని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్ప‌టికే ప్రకటించింది. దీంతో బ్రూక్‌ను రెండు సంవత్సరాల పాటు టోర్నమెంట్ నుండి నిషేధించారు.

2024 ఐపీఎల్ సీజన్ నుంచి కూడా తప్పుకున్న బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు బ్రూక్ 2025 టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో మరో ఆటగాడి పేరును ఢిల్లీ జట్టు ఇంకా ప్రకటించలేదు.

బ్రైడాన్ కార్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఇటీవల జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కాలికి గాయం కావడంతో కార్స్ రాబోయే సీజన్‌కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రైడాన్ కార్స్ గాయపడ్డాడు.

కాగా, బ్రైడాన్ కార్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా ఈ సీజన్‌కు దూర‌మ‌య్యాడు. దీంతో అత‌ని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు వియాన్ ముల్డర్‌ను రూ.75 లక్షలకు ఫ్రాంచైజీలోకి చేర్చారు.

లిజాద్ విలియమ్స్ (ముంబై ఇండియన్స్)

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాద్ విలియమ్స్.. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్‌కు దూర‌మ‌య్యాడు. వేలంలో ముంబై ఇండియన్స్ లిజాద్ విలియమ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను అందుబాటులో లేక‌పోండంతో లిజాద్ విలియమ్స్ స్థానంలో కార్బిన్ బాష్ జట్టులోకి వచ్చాడు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాద్ విలియమ్స్.. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ జ‌ట్టు వేలంలో లిజాద్ విలియమ్స్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను అందుబాటులో లేకపోవడంతో, అత‌ని స్థానంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ కార్బిన్ బాష్ జట్టులోకి వచ్చాడు.

అల్లా గజన్ఫర్ (ముంబై ఇండియన్స్)

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ కాలి గాయం కార‌ణంగా ఆ టోర్నీకి దూరం అయ్యాడు. అయితే, అత‌ను ఇంకా కోలుకోక‌పోవ‌డంతో.. ఐపిఎల్ 2025 నుండి తప్పుకున్నాడు. వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆఫ్ఘన్ ముజీబ్ ఉర్ రెహమాన్ రూ.2 కోట్లకు ఫ్రాంచైజీలో చేరనున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్)

ఇండియన్​ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత కొంతకాలంగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వెన్నునొప్పి గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే బుమ్రా ఈ ఐపీఎల్​లోనైనా బరిలోకి దిగుతాడా అనేది అనుమానంగా ఉంది. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఇంకా అతడికి క్లియరెన్స్ రాలేదు.

ఐపీఎల్​ తర్వాత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో బుమ్రాపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీంతో 2025 ఐపీఎల్​ సీజన్​లో ప్రారంభ మ్యాచ్​లకు అతడు దూరం కానున్నాడు. అయితే ఏప్రిల్ తొలి లేదా రెండో వారంలో ముంబయి జట్టుతో కలిసే అవకాశం ఉంది. కానీ అది కూడా పక్కాగా చెప్పలేం. మొత్తానికి బుమ్రా ఎన్ని మ్యాచ్​లు మిస్ అవుతాడు? అనేది కూడా క్లారిటీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *