ipl bigfight| నేడు రాజస్థాన్‌తో ముంబై ఢీ

ipl bigfight| నేడు రాజస్థాన్‌తో ముంబై ఢీ
గువాహటి వేదికగా మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు ప్రారంభం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్-2026లో మరో బిగ్‌ఫైట్ జరగనుంది. గౌహతి వేదికగా రాజస్థాన్, ముంబై తలపడనున్నాయి. రాజస్థాన్ జట్టు మంచి జోరు మీద ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. సీఎస్కేపై విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుని పూర్తి స్థాయి కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇవాళ ముంబైపై కూడా గెలిసి రాజస్థాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించాలని చూస్తోంది. రియాన్ పరాగ్ బృందం గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి వరకు పోరాడి గెలిచింది. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రవీంద్ర జడేజాతో రాయల్స్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, జడేజా, రవి బిష్ణోయ్ ఉన్నారు.

మరోవైపు ముంబై జట్టు ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించింది. కానీ రెండో మ్యాచులో అదే జోరును చూపించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ముందు బోల్తా పడింది. దాంతో ఈ మ్యాచ్ ముంబైకి కీలకంగా మారనుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్‌లో ఉన్నారు. కానీ తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్ రాణించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, కార్బిన్ బాష్, మయాంక్ మార్కండే బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది. అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచులోనైనా బరిలోకి దిగుతాడా లేదా అనేది చూడాలి. ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై ముంబై జట్టుదే ఆధిపత్యం. ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబై గెలువగా, 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది.

ఐపీఎల్ 2026లో భాగంగా జరగనున్న 13వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఆడనున్నాయి. గువాహటి వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనా
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, బర్గర్, రవి బిష్ణోయ్.
ముంబై ఇండియన్స్ జట్టు అంచనా
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్‌ఫేన్ రూధర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే.
