IPL | ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్త కెప్టెన్‌

IPL | ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్త కెప్టెన్‌

IPL | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం తెలిపింది. కమిన్స్‌ గాయం నుంచి కోలుకునే వరకు.. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది.

హైదరాబాద్ జట్టు యువ వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ని నియమించినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఐపీఎల్ 2016 విజేతలైన ఎస్‌ఆర్‌హెచ్, ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుంది. కాగా ప్రస్తుతం జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ గాయంతో బాధపడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిన్స్ వెన్నునొప్పి (బ్యాక్ ఇంజరీ) కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ దశలో మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో తాత్కాలికంగా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సీజన్‌లో ఇషాన్‌కు డిప్యూటీగా అభిషేక్ శర్మ వ్యవహరించనున్నాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించనున్నారు. అయితే ఇషాన్ కిషన్ పూర్తి సీజన్‌కు కెప్టెన్‌గా కొనసాగడంలేదు. పాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరిన తర్వాత మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కమిన్స్ మార్చి 23వ తేదీన ఎస్ఆర్‌హెచ్‌ జట్టులో కలిసే అవకాశం ఉంది.

Leave a Reply