పద్మశాలి కార్తీక వనభోజన మహోత్సవానికి ఆహ్వానం..

కరీమాబాద్, (ఆంధ్రప్రభ): పద్మశాలి కార్తీక, సామూహిక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నారని పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ తెలిపారు.

గురువారం సాయంత్రం పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, పోపా ప్రతినిధులతో కలిసి మంత్రి కొండా సురేఖ దంపతులను వారి స్వగృహంలో కలసి ప్రత్యేక ఆహ్వానం అందజేశారు.

ఈ సందర్భంగా పద్మశాలి వనభోజన ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల నవంబర్ 16, ఆదివారం చింతల్ బ్రిడ్జి సమీపంలోని ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.

మంత్రి సురేఖ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు శామంతుల శ్రీనివాస్ తెలిపారు.

కార్యక్రమంలో పోపా రాష్ట్ర ప్రతినిధులు ధర్మపురి రాజగోవిందు, గోషికొండ సుధాకర్, జిల్లా అధ్యక్షులు గుండు కామేశ్వర్, రాష్ట్ర చేనేత నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, మంతెన సునీత తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ఆహ్వానం.. వనభోజనాన్ని విజయవంతం చేయండి

పద్మశాలి కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి పద్మశాలి కులబాంధవులందరూ హాజరుకావాలని పద్మశాలి సంఘం నాయకులు మేరుగు అశోక్, శ్రీరామ్ రాజేష్, గడ్డం రవి పిలుపునిచ్చారు.

34వ, 35వ డివిజన్లలో పర్యటించిన వారు ప్రతి పద్మశాలి కులబాంధవుల ఇంటింటికి చేరుకుని, ఈనెల 16 ఆదివారం ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ లో జరిగే వనభోజన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని కరపత్రాలు అందజేశారు.

Leave a Reply