అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు

అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు

  • 10 మంది అరెస్ట్
  • ​నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 34 కేసుల ఛేదన
  • ​​వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : గత మూడు నెలలుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ వెల్లడించారు.
​కేసు వివరాలు:
​నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, నందిపేట, బోధన్ రూరల్, ఎడపల్లి మండలాలతో పాటు నిర్మల్ జిల్లాలోని బాసర, ముధోల్, భైంసా ప్రాంతాల్లో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. టెక్నికల్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
​ముఠా సభ్యులు – నేర చరిత్ర:
​అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు అఫ్జల్ ఖాన్‌తో పాటు సిద్ధీక్ ఖాన్, అర్బాజ్ ఖాన్, మహమ్మద్ అఫ్సర్ ఉన్నారు. వీరంతా గతంలో పశువుల దొంగతనాలు, ఆటో దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లిన పాత నేరస్తులే. జైలులోనే పరిచయమైన వీరంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి, సులువుగా డబ్బు సంపాదించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్నారు. చోరీ చేసిన సొత్తును భైంసాకు చెందిన మెయిన్ రిసీవర్ మహబూబ్ ఖాన్‌తో పాటు నిజామాబాద్‌కు చెందిన బాలాజీ, రహాన్ రాజా, నాందేడ్‌కు చెందిన ఆరిఫ్‌లకు విక్రయించేవారు.
​స్వాధీనం చేసుకున్న సొత్తు:
​1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్
​రూ. 2,75,000 నగదు
​రెండు ద్విచక్ర వాహనాలు (హీరో గ్లామర్, హోండా యూనికాన్)
​ఒక ఆటో (నెం. TG-16-T-1528)
​దొంగతనానికి వాడిన పనిముట్లు.
​కేసును ఛేదించిన పోలీస్ బృందం:
​నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సిబ్బంది వివరాలు:
సర్కిల్ ఇన్‌స్పెక్టర్: బి. శ్రీనివాస్ (నార్త్ రూరల్ సర్కిల్)
సబ్ ఇన్‌స్పెక్టర్: కె. శ్రీకాంత్ (నవీపేట పిఎస్)
నవీపేట సిబ్బంది: ఎస్సై యాదగిరి గౌడ్, ఎస్సై రాజశేఖర్ (మాక్లూర్ పిఎస్), ఎస్సై గంగాధర్ (ఐదవ టౌన్), ఎస్సై గఫూర్ (ASI), హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్.
కానిస్టేబుళ్లు: రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్, ఐటి కోర్ టీం సభ్యులు.
​ఈ కేసులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని సీపీ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply