cm| ఉక్కు మహిళ సోనియమ్మ సంకల్పంతోనే తెలంగాణ

cm| ఉక్కు మహిళ సోనియమ్మ సంకల్పంతోనే తెలంగాణ
ప్రజాభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని, దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఉక్కు మహిళ సోనియమ్మ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం తెలిపారు.
ఎక్కడ అవకాశం ఉన్నా ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్‌గా మహిళ బాధ్యత వహిస్తున్న విషయం గుర్తు చేశారు. ఎస్‌ఐబీ అధిపతిగా మహిళను నియమించామని, వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని తెలిపారు. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామన్నారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
