ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య

ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఓ ఇంట‌ర్ విద్యార్థిని వెంట‌ప‌డి.. ప్రేమ‌లో ప‌డేసి.. లైంగిక దాడి చేసి హ‌త్య చేసిన అమానుష సంఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా(Nallagonda District) కేంద్రంలో చోటు చేసుకుంది. నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన (17) బాలిక నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల(Nallagonda District)లో ఇంటర్ విద్యార్థి.

గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాఅంటూ గట్టు కింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణ(Gaddam Krishna) అనే యువకుడు ఆ బాలిక వెంటపడ్డాడు. చివ‌ర‌కు ఆ యువకుడు మాయ మాటలు చెప్పి బాలికను ప్రేమ‌లో ప‌డేశాడు. ఈ రోజు బాలికను ఒంటరిగా కలుద్దామని చెప్పిన యువకుడు శంషునగర్ రోడ్ నెంబర్ 8 లోని వాటర్ ట్యాంక్(Water Tank) సమీపంలోని తన ఫ్రెండ్ గదికి బాలికను తీసుకెళ్లాడు.

అక్కడ మరో ఫ్రెండ్ తో కలిసి బాలికపై లైంగిక‌దాడి చేసి అనంత‌రం హ‌త్య చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్‌పీ శివరాం రెడ్డి(DSP Sivaram Reddy) ప‌రిశీలించి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply