inspection | ఓటును నిర్భయంగా వేయండి..

inspection | ఓటును నిర్భయంగా వేయండి..

inspection | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఓటర్లు నిర్భయంగా ఓటును వేయాలని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ అన్నారు. రెండవ సాధారణ పంచాయతీ సర్పంచి,వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా(Manchryala District) జన్నారం మండలంలోని కవ్వాల, బంగారుతాండ, తదితర సమస్యాత్మక గ్రామాల్లోని ఎన్నికల కేంద్రాలను ఈ రోజు సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ(surprise inspection) చేసి, పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓటర్లతో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసుకోవడానికి తమ పోలీసులు సహకరిస్తారని ఆయన తెలిపారు. మద్యం, డబ్బులు పంచుతున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో లక్షేటిపేట సీఐ రమణమూర్తి,స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష, పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply