పీసీబీ అధికారుల పరిశీలన
చౌటుప్పల్ , ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్(Chautauqua Division)లోని రహదారులపై రసాయనిక వ్యర్థాలు పడేస్తున్నారు. ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమలు(Industries) నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రసాయనిక వ్యర్థాలు వేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు, చెరువులు, పంట భూములు కలుషితమవుతున్నాయి.
చౌటుప్పల్ మండల పరిధిలోని బొర్రోల్లగూడం(Borrollagudam) గ్రామ సమీపాన జాతీయ రహదారి 65 పక్కన దండు మల్కాపురం దర్గా మట్టి రోడ్డు వెంబడి స్థానికంగా ఉన్న రసాయన పరిశ్రమల యాజమాన్యాలు గురువారం తెల్లవారుజామున ట్యాంకర్ ద్వారా ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను తీసుకువచ్చి వదిలి వేశారు.
స్థానిక రైతులు గుమ్మి నరేందర్ రెడ్డి(Gummi Narender Reddy), రావుల లింగయ్య తదతరులు పొల్యూషన్ బోర్డు కంట్రోల్(Pollution Board Control) అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పీసీబీ అధికారులు ఈ రోజు వచ్చి శ్యాంపిల్స్ తీశారు. చౌటుప్పల్(Chautuppal) మండలంలోని దండు మల్కాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన పారబోసిన రసాయన వ్యర్థాల శాంపిల్స్ ను ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులు ఏఈఎస్ పురుషోత్తంరెడ్డి(AES Purushottam Reddy), ఏఈఈ శంకర్ బాబు లు సేకరించారు. వాటిని పరీక్షలకు పంపిస్తున్నామన్నారు.