Indrakiladri | వైభవంగా ఆదిదంపతుల వెండి రధోత్సవం

విజయవాడ, మార్చి 30 (ఆంధ్రప్రభ): శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం సందర్బంగా నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న ఆదిదంపతుల రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఉగాది పర్వదినం ఆదివారం సాయంత్రం కొండ పైనుండి బయలుదేరిన వెండి రథం ఘాట్ రోడ్ మీదుగా కామదేను అమ్మవారి ఆలయం మీదుగా ఊరేగింపుగా తరలి వెళ్ళింది.

ముందుగా కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించి, రథాన్ని లాగి ప్రారంభించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన రధం బ్రాహ్మణవీధి మీదుగా వన్ టౌన్ పురవీధులలో విహరించింది.తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజనలు మధ్య దుర్గా నామ స్మరణ తో రధోత్సవం కన్నుల పండువుగా వెండి రథోత్సవం కొనసాగింది.

వైభవంగా ఇంద్రకీలాద్రిపై ఉగాది ఉత్సవాలు…

శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామున అమ్మవారి కి స్నప నభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలను శాస్త్రవేత్త నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం 8:15 నిమిషాల నుండి అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో కూడా దేవత మిత్రులకు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభమైంది.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో ఆలయ ప్రాంగణాన్ని చక్కగా అలంకరించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు….

పూజ మండపం ప్రారంభం….

ఆలయ ప్రాంగరంలో నీ నటరాజస్వామి దయ్యం ప్రక్కన నూతనంగా నిర్మించిన పూజ మండపాన్ని దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ ఉగాది పర్వదినం రోజున ఆదివారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజా మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. …..

ప్రత్యేక పుష్పార్చన…

ఉగాది పర్వదినం సందర్భంగా వసంత నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా నిర్మించిన పూజ మందిరంలో ఈ ప్రత్యేక పుష్పార్చనను వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లెపూలు కనకాంబరాలు, మరువములు ఇలా పలు రకాల పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

.కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి…

తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి రావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ కిక్కిరి సాయి. ఒకవైపు వసంత నవరాత్రుల ప్రారంభం, ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్ లో ఎదురు చూశారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి దర్శనాన్ని అధికారులు ఉదయం 8:15 నిమిషాల నుండి ప్రారంభించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అలాగే అంతరాలయ దర్శనాన్ని కూడా నిలుపుదల చేసిన అధికారులు, రూ 500 టికెట్ల జారీని కూడా నిలిపి వేశారు.

అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉచిత క్యూలైన్లతో పాటు అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండి ఉన్నాయి. …..

ఉచితం మజ్జిగ పంపిణీ ప్రారంభం..

ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవికాలం ఎండ నుండి ఉపశమనానికి అధికారులు ఉచిత మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది పర్వదినం సందర్భంగా మొదటి రోజు దేవాదిశాఖ కమిషనర్ ఈవో రామచంద్ర మోహన్ మజ్జిగ పంపిణీకి పదివేల రూపాయలు విరాళాన్ని అందజేయడంతో, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులు చిన్న గోపురం వద్ద ఏర్పాటుచేసిన పంపిణీ కేంద్రం వద్ద మజ్జిగను స్వీకరించారు.

Leave a Reply