దామెరలో ఇందిరమ్మ గృహ ప్రవేశం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దామెర గ్రామంలో సాతిరి రమేష్ దంపతులు నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై రమేష్ కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
